![]() |
![]() |

"నీతోనే డాన్స్" షోలో పవన్, నటరాజ్ మధ్య ఫైట్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఈ వారం ఒక జోడికి ఇంకో జోడి తక్కువ మార్క్స్ ఇచ్చుకుని కోట్ల మంది చూసే ఈ షోలో బాగా గొడవపడ్డారు. కొట్టుకునే స్థాయి వరకు వెళ్ళిపోయింది. "అంజలి నీ పెర్ఫార్మెన్స్ బాలేదని నటరాజ్ మాస్టర్ అన్ని మాటలు అన్నారు" మరి నీ అభిప్రాయం ఏమిటి అని శ్రీముఖి అడిగేసరికి "డాన్స్ చేయడం కోసం వచ్చాము. ముందుగానే స్కెచ్ వేసుకుని, ప్లాన్ వేసుకుని వీళ్లకు ఇన్ని మార్క్స్ ఇవ్వాలి అని ఐతే రాలేదు ఎలా చేసినా అది అలాగే వస్తుంది" అని అంజలి నటరాజ్ మాస్టర్ ని ఉద్దేశించి కామెంట్ చేసేసరికి "అంజలి మాకు అనిపించింది చెప్పాం.. ఐనా పవన్ ఈ డిస్కషన్స్ ఏమీ వద్దు. నేను డాన్స్ కూడా చేయలేకపోతున్నా" అని నీతూ కొంచెం స్లో గానే చెప్పింది.
"నేను మాట్లాడ్డం మొదలుపెడితే అన్ని చెప్పేయాల్సి వస్తుంది..నేను గనక మీకు మార్క్స్ ఇచ్చి ఉండకపోతే మీరెప్పుడో ఇంటికి వెళ్ళిపోయేవారు.. " అని నటరాజ్ మాస్టర్ అనేసరికి పవన్ కి కోపం వచ్చేసింది. "నువ్వెవరయ్యా నాకు మార్క్స్ ఇచ్చేది..." అనేసరికి "ఏ ఏంటి..ఎం మాట్లాడుతున్నావ్..విశ్వాసం లేదు నీకు" అని నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యారు. "నటరాజ్ మాస్టర్ మీరు మార్క్స్ ఇస్తేనే వాళ్ళు ఉన్నారన్నది రాంగ్.. మీరు ఇచ్చిన స్కోర్ వల్లనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అనడం కరెక్ట్ కాదు.. వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఉన్నారు" అని అన్నారు రాధ, సదా. "ఎవరో ఏదో చెప్తే వినటానికి షో చేయడానికి నేను రాలేదు. "ప్రతీది కూడా వాళ్లకు ఫోన్స్ చేసి మాట్లాడి వాళ్లకు మార్క్స్ తగ్గించేసి , వీళ్లకు తగ్గించేసి వాళ్ళను పంపించేయాలి అనే మనస్తత్వం నాది కాదు. ఈ విషయాలన్నీ బయట పెడితే చాలా ఉంటాయి. అందుకే మాట్లాడను" అని అన్నారు నటరాజ్ మాస్టర్. "ఇదిగో ఇది నాకు నచ్చదు...చేస్తే చేద్దాం..లేదంటే వెళ్ళిపోదాం.. ఎవడికి భయపడేది. ఊరికే మాటలు అనిపించుకుని ఉండమంటే ఉండను తప్పు చూపిస్తే ఒప్పుకుంటా..లేనప్పుడు అస్సలు ఒప్పుకోను.. స్క్రీన్ ముందు, స్క్రీన్ వెనక కూడా ఒక్కలాగే ఉంటాను అదే నా క్యారెక్టర్ " అని నీతూకి స్టేజి మీదే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు నటరాజ్ మాస్టర్.
![]() |
![]() |